image



పాక్‌ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్‌ ఉల్‌ హఖ్‌ కాకర్‌




→పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పార్లమెంట్‌ సభ్యుడు, బలూచిస్థాన్‌ అవామీ పార్టీ నాయకుడు అన్వర్‌ ఉల్‌ హఖ్‌ కాకర్‌ (52)ను నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి నిర్ణయం తీసుకున్నారు. 
 
→ఆగస్టు 9న పార్లమెంట్‌ రద్దు కాగా, దేశ చట్టాల ప్రకారం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 
 
→జనగణన, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కారణంగా రెండు నెలల పాటు ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. 
 
→ఈ తరుణంలో ఆపద్ధర్మ ప్రధాని ఎంపికపై మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, ప్రతిపక్ష నేత రజా రియాజ్‌ రెండు దఫాలుగా చర్చలు జరిపి అన్వర్‌ పేరును ఖరారు చేశారు. 
 
→దీనికి అధ్యక్షుడు ఆమోదముద్ర వేశారు. తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన అన్వర్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
 



International