imageపాకిస్థాన్‌ పార్లమెంటు రద్దు
 
→పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దయింది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ విజ్ఞప్తి మేరకు ప్రస్తుత ప్రభుత్వానికి మూడు రోజుల పదవీకాలం ఉండగానే అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ పార్లమెంటును రద్దు చేశారు. 
 
→ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక నోటిఫికేషన్‌ విడుదలైంది. 
 
→పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 58 ప్రకారం.. జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
→ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
 International