image



వాగ్నర్‌ కొత్త అధిపతిగా ట్రోషెవ్‌!




→కాంట్రాక్టు సేన వాగ్నర్‌ గ్రూపు అధిపతి ప్రిగోజిన్‌ అనుమానాస్పద మృతి అనంతరం ఆ కిరాయి దళ బాధ్యతలను వాగ్నర్‌ దళపతుల్లో ముఖ్యుడైన ఆండ్రి ట్రోషెవ్‌ కు రష్యా అధినేత పుతిన్‌ అప్పగించారు. 
 
→రష్యా సైన్యంలో గతంలో అధికారిగా ఉన్న ట్రోషెవ్‌ 2014 నుంచి వాగ్నర్‌ గ్రూపులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 
 
→వాగ్నర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హోదాలో సిరియాలో పోరాట కార్యకలాపాలను పర్యవేక్షించారు. 
 
→ఆయనపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించింది కూడా. ఇక నుంచి ఉక్రెయిన్‌లో పోరాటం కొనసాగించే వాగ్నర్‌ గ్రూపు దళాలకు నాయకత్వం వహించాల్సిందిగా ట్రోషెవ్‌ను పుతిన్‌ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 



International