image



అమెరికాలో భారతీయులు 47 లక్షలు




→అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దాదాపు 47 లక్షల మంది అని తేలింది. 
 
→ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లెక్కల వివరాలను విడుదల చేశారు. 
 
→పదేళ్లకోసారి రూపొందించే లెక్కల్ని ఈసారి మూడేళ్లు ఆలస్యంగా వెల్లడించారు. 
 
→కరోనా మహమ్మారి తీవ్రత, గోప్యత పరిరక్షణ చర్యలే దీనికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
→జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో చైనీయులు ఎక్కువ. ఆ దేశానికి చెందిన వారు 52 లక్షల మంది అగ్రరాజ్యంలో ఉన్నారు. 
 
→తర్వాత స్థానం భారతీయులదే. ఫిలిప్పీన్స్‌ వారు 44 లక్షలు, వియత్నాం ప్రజలు 22 లక్షల మంది ఉన్నారు. 
 
→ఉత్తర ఆఫ్రికా, వెనెజువెలాకు చెందినవారు వేగంగా పెరుగుతున్నారనీ, వీరి జనాభా 35 లక్షలు ఉందని తేలింది.
 



International