image



దివాలా తీసిన బర్మింగ్‌హామ్‌




 
 
→బ్రిటన్‌లోని రెండో అతిపెద్దదైన బర్మింగ్‌హామ్‌ నగరపాలక సంస్థ (సిటీ కౌన్సిల్‌) దివాలా తీసింది. 
 
→లక్షల పౌండ్ల వార్షిక బడ్జెట్‌ లోటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. 
 
→ఈ నగరం కౌన్సిల్‌ను ప్రతిపక్ష లేబర్‌ పార్టీ పాలిస్తోంది. ఇది ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ. 
 
→దాదాపు 10 లక్షల మందికి సేవలు అందిస్తుంది. నిధుల లోటు కారణంగా సెక్షన్‌ 114 నోటీస్‌ను ఫైల్‌ చేసింది. 
 
→అందులో అత్యవసరం కాని అన్ని ఖర్చులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దీని ఆదాయం సుమారు 4.3 బిలియన్‌ పౌండ్లు. 
 
→సమాన చెల్లింపు బాధ్యతకు ఇప్పటి వరకూ సుమారు 650 మిలియన్‌ పౌండ్ల నుంచి 760 మిలియన్‌ పౌండ్లను చెల్లించాల్సి ఉంది. 
 
→అయితే ఈ మేరకు నిధులను సమకూర్చుకోవడానికి కౌన్సిల్‌కు మార్గాలు లేకపోవడంతో దివాలా ప్రకటించింది. 
 
→మరోపక్క లోకల్‌ గవర్నమెంట్‌ అసోసియేషన్‌ అదనపు సాయం అందించాలని సిటీ కౌన్సిలర్లు జాన్‌ కాటన్, షెరెన్‌ థాంప్సన్‌లు కోరారు. 
 
→2023 - 24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 109 మిలియన్‌ పౌండ్లు అవసరం దీనికి ఉంది. 
 
→తమకు అందాల్సిన 1.25 బిలియన్‌ పౌండ్ల నిధులను కన్జర్వేటివ్‌ ప్రభుత్వం లాక్కొందని థాంప్సన్‌ ఆరోపించారు. 
 
→ఈ పరిస్థితిపై బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ స్పందించింది. తమకు అక్కడి ఆర్థిక సమస్యలు తెలుసని పేర్కొంది. 
 
→అక్కడి ప్రజల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అదనంగా తాము సాయం అందిస్తామని ప్రధాని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 
 
→స్థానిక ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి వచ్చే బడ్జెట్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.
 



International