image



ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిగా ఉమరోవ్‌ ఎంపిక




→రష్యాతో యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతున్న తరుణంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 
 
→కీలకమైన రక్షణ మంత్రిని మార్చేశారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న అలెక్సీ రెజ్నికోవ్‌ స్థానంలో రుస్తెం ఉమరోవ్‌ (41)ను ఎంపిక చేశారు. 
 
→రెజ్నికోవ్‌ 550 రోజులకు పైగా యుద్ధాన్ని పర్యవేక్షించారు. కొత్త విధానాలు అవసరం అయినందువల్లే ఆ బాధ్యతలను రుస్తెం ఉమరోవ్‌కు అప్పగిస్తున్నామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. 
 
→ఈ నేపథ్యంలో రెజ్నికోవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రక్షణమంత్రి పదవి చేపడుతున్న ఉమరోవ్‌ ప్రతిపక్ష హోలోస్‌ పార్టీ నాయకుడు. 
 
→2022 సెప్టెంబరు నుంచి ఉక్రెయిన్‌ ప్రభుత్వ ఆస్తుల నిధికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పాశ్చాత్య దేశాల మన్ననలు పొందారు. 
 
→అంతేకాదు, తుర్కియే అధ్యక్షుడు రెసిప్‌ ఎర్డొగాన్‌కు ఉమరోవ్‌ సన్నిహితుడు.
 



International