image



సింగపూర్‌ ఎన్నికల్లో షణ్ముగరత్నం ఘన విజయం




→భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్‌ షణ్ముగరత్నం (66) సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించారు. 
 
→ఈ మేరకు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఓట్లు ఆయనకు దక్కటం విశేషం. 
 
→పోలైన 20,48,000 ఓట్లలో మాజీ మంత్రి షణ్ముగరత్నంకు మద్దతుగా 70.4 శాతం ఓట్లు (17,46,427) పడ్డాయి. 
 
→ఆయన ప్రత్యర్థులైన చెనా సంతతి అభ్యర్థులు ఎన్జీ కాక్‌ సాంగ్, టాన్‌ కిన్‌ లియాన్‌లకు వరుసగా 15.72 శాతం, 13.88 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల విభాగం తెలిపింది. రిటర్నింగ్‌ అధికారి ప్రకటించిన ఈ ఫలితాలతో సింగపూర్‌కు భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక ఖరారైంది. 
 
→గతంలో భారతీయ సంతతికి చెందిన ఎస్‌.రామనాథన్, దేవన్‌ నాయర్‌ సింగపూర్‌ అధ్యక్షులుగా పనిచేశారు. 
 
→సింగపూర్‌కు 9వ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్‌ షణ్ముగరత్నం 2011 నుంచి 2019 దాకా సింగపూర్‌ ఉప ప్రధానిగా సేవలందించారు. 
 
→2019 - 2023 మధ్యకాలంలో సీనియర్‌ మంత్రిగా కేబినెట్‌లో విధులు నిర్వహించారు. 
 
→ప్రముఖ ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరున్న షణ్ముగరత్నం సింగపూర్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957లో పుట్టారు. 
 
→లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా పొందారు. 
 
→తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశారు.
 



International