image



ఆగస్టులో ఉత్తరార్ధ గోళంలో రికార్డు ఉష్ణోగ్రతలు




→ఈ ఏడాది ఉత్తరార్ధ గోళంలో ఆగస్టులో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ (డబ్ల్యూఎంవో), ఐరోపా వాతావరణ సంస్థ కొపెర్నికస్‌ ప్రకటించాయి. 
 
→అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది జూలైలో నమోదయ్యాయి. 
 
→ఆగస్టులో ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి పూర్వమున్న స్థాయికన్నా 1.5 సెల్సియస్‌ డిగ్రీలు ఎక్కువ. 
 
→ఈ లెక్కన భూఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల వద్ద పట్టి నిలపాలన్న పారిస్‌ వాతావరణ సభ తీర్మానం ఏమవుతుందనే ఆందోళన పెరిగింది.  
 
→భూమిపై 70 శాతం సముద్రాలే ఉన్నాయి. అవి ఈ ఏడాది మూడు నెలల పాటు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. 
 
→వాటి ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. 
 
→దీనిపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ స్పందిస్తూ వాతావరణ విచ్ఛిన్నం మొదలైందని హెచ్చరించారు.
 



International