image



ప్రపంచంలోనే అతి పొడవైన నదీ పర్యాటక నౌక ప్రారంభం




 
 
→భారత్‌లో కొత్తతరం పర్యాటకానికి ‘ఎం.వి.గంగా విలాస్‌’ విహార నౌక నాంది పలుకుతోందని ప్రధాని మోదీ అన్నారు. 
 
→ప్రపంచంలోనే అతి పొడవైన నదీ పర్యాటక నౌకను వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. 
 
→వారణాసిలో మొదలైన గంగా విలాస్‌ ప్రయాణం అయిదు భారతీయ రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌ మీదుగా కొనసాగుతుంది. 
 
→దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయని మోదీ తెలిపారు.   
 
→ 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో భారత్‌లోనే తయారైన ‘గంగా విలాస్‌’ నౌకలో స్విట్జర్లాండ్, జర్మనీలకు చెందిన 32 మంది పర్యాటకులు తొలి ప్రయాణం చేయనున్నారు. 
 
→వారణాసి నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్‌ వరకు ఈ ప్రయాణం సాగుతుంది. 
 
→మధ్యలో ఢాకా మీదుగా బంగ్లాదేశ్‌ జలాల్లోనూ నౌక పయనిస్తుంది. 2024 మార్చి వరకు అపుడే బుకింగు పూర్తికావడం విశేషం. 
 
→ఇందులో అధిక శాతం అమెరికా, యూరప్‌ దేశాల పర్యాటకులు ఉన్నారు. 2024 ఏప్రిల్‌ నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.  
 
→ ఈ నౌకలో ఏక కాలంలో 36 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. 
 
→జిమ్‌ సెంటర్, స్పా, శాకాహార భారతీయ వంటకాలు, ఆల్కహాల్‌ లేని పానీయాలు, వైద్యులు వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 
 
→35 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న మహదేవ్‌ నాయక్‌ కెప్టెన్‌గా ఉన్న ఈ నౌకలో 39 మంది సిబ్బంది ఉంటారు. 
 
→మొత్తంగా 51 రోజుల ప్రయాణానికి అన్ని పన్నులతో కలిపి ఒక్కొక్కరికి రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు ఖర్చు అవుతుందని క్రూయిజ్‌ నిర్వాహకులు వెల్లడించారు. 
 
→వారణాసిలో గంగా హారతితో మొదలై బిహార్‌లోని విక్రమ శిల యూనివర్సిటీ, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్‌ డెల్టా, అస్సాంలోని కజిరంగా నేషనల్‌ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను చూడొచ్చని తెలిపారు.
 
→పర్యాటకుల కోసం వారణాసిలో గంగానది తీరాన నిర్మించిన ‘టెంట్‌ సిటీ’ని సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. 
 
→‘టెంట్‌ సిటీ’ ఏటా అక్టోబరు నుంచి జూన్‌ వరకు పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. 
 
→ఇందులో వసతి సౌకర్యాలతో పాటు శాస్త్రీయ సంగీతం, యోగా వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.
 



National