→ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యాన వనాల్లో ఒకటైన రాష్ట్రపతి భవన్‌లోని మొగల్ గార్డెన్స్ పేరు మారింది.
→ఇక నుంచి దీనిని ‘అమృత్ ఉద్యాన్’గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
→75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను దేశం నిర్వహించుకొంటున్న వేళ మొగల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నావికా గుప్తా తెలిపారు.
→ రాష్ట్రపతి భవన్‌లో 15 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉద్యాన వనాన్ని భువిలో స్వర్గమంటారు. ప్రపంచంలోనే అరుదైన పుష్పాలు, మొక్కలకు ఈ గార్డెన్స్ వేదిక.
→ జమ్మూ-కశ్మీర్‌లోని మొగల్ గార్డెన్ స్పూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. 1911లో కింగ్ జార్జ్ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చనున్నట్లు ప్రకటించారు.
→ సర్ ఎడ్విన్ లుటియన్స్ సర్ హర్బెర్ట్ బేకర్ కలిసి వైస్రాయ్ హౌస్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ కేంద్రంగా న్యూదిల్లీకి రూపకల్పన చేశారు.
→ స్వాతంత్య్రం అనంతరం వైస్రాయ్ హౌస్, రాష్ట్రపతి భవన్‌గా మారింది. 1917లో మొగల్ గార్డెన్స్ ఆకృతికి లుటియన్స్ తుదిరూపు ఇచ్చారు.
→ మొక్కలు నాటడం మాత్రం 1928 - 29 మధ్య ప్రారంభమైంది. ఇందులో ఈస్ట్ లాన్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్, హెర్బల్-1, హెర్బల్-2, టాక్టైల్ గార్డెన్, బొన్సాయ్ గార్డెన్, ఆరోగ్య వనం పేర్లతో భిన్నమైన తోటలు ఉన్నాయి.
→ ఇందులో 150 రకాల గులాబీలు, ఎన్నో రకాల తులిప్స్, ఆసియాటిక్ లిల్లీస్, ప్రపంచంలోనే అరుదైన పుష్పాలు ఉన్నాయి. ఈ గార్డెన్స్ సంరక్షణకు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
National