image



దేశీయ విపణిలోకి భారత్‌ బయోటెక్‌ నాసికా టీకా




→కొవిడ్‌-19 వ్యాధికి నాసికా టీకా ‘ఇన్‌కొవ్యాక్‌’ దేశీయంగా అందుబాటులోకి వచ్చింది. 
 
→కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్రసింగ్‌ సమక్షంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ దిల్లీలో ఈ టీకాను విడుదల చేశారు. 
 
→కరోనాకు ప్రపంచంలోనే ఇదే తొలి నాసికా టీకా. దీన్ని ఆవిష్కరించిన ఘనత హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌కు దక్కింది. 
 
→‘ఇన్‌కొవ్యాక్‌’ టీకాను 2 ప్రాథమిక డోసులకు, బూస్టర్‌ డోసుకూ వినియోగించొచ్చు. ఈ టీకాకు ప్రైవేటు మార్కెట్లో ఒక డోసుకు రూ.800 ధర నిర్ణయించారు. 
 
→ప్రభుత్వానికి రూ.350కే లభిస్తుంది. తాజాగా కొవిన్‌ పోర్టల్‌లో దీనిని పొందుపరిచారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌ బయోటెక్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. 
 
→కేంద్రం ‘కొవిడ్‌ సురక్ష’ కింద నిధులు సమకూర్చి సహకరించింది.
 



National