image



అస్సాంలో విద్యుత్తు వాహన విప్లవం




→ త్రిచక్ర విద్యుత్తు వాహ నాల అమ్మకాల్లో అస్సాం రాష్ట్రం దూసు కుపోతోంది. 
 
→2022 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు కొత్త విద్యుత్తు త్రిచక్ర వాహనాల అమ్మకాల లక్ష్యంలో 85 శాతాన్ని సాధించిన అస్సాం 2025 కల్లా వంద శాతానికి
చేరుకొంటుందని అమెరి కాలోని జడ్గవీ (శూన్య ఉద్గార వాహ నాలు) పరిశోధన కేంద్రం తెలిపింది. 
 
→భారత్ లో ఏ విభాగంలోనైనా భారీగా విద్యుత్తు వాహనాల అమ్మకాలను సాధించిన రాష్ట్రాల్లో అస్సాంతోపాటు ఉత్త రాఖండ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ ఉన్నాయి. 
 
→భారత్లోనే కాదు. ప్రపంచమంతటా అస్సాం మాదిరిగా రికార్డు సృష్టించిన ప్రాంతం మరొకటి లేదని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన జస్ఈవీ పరిశోధన కేంద్ర అధ్యయనం తెలిపింది. 
 
→2070 కల్లా నెట్ జీరో (కర్బన ఉద్గారాల తటస్థత)ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఏయే రంగాల్లో ఎంతెంత మేర లక్ష్యాలు సాధించాలో నిర్దేశించకుండా ఆ పనిని రాష్ట్రాలకే వదిలేసింది.
 
→ ఇప్ప టివరకు 25 భారతీయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యుత్తు వాహన విధానాలను ప్రకటించాయి. 
 
→ ఈ వాహనాల ఉత్పత్తి, చార్జింగు కేంద్రాల ఏర్పా టుకు రాయితీలు, పన్ను మినహాయింపులు, ఇతర ప్రోత్సాహకాలను ఇవి అందిస్తున్నాయి. 
 
→ 2030 నాటికి ఈ రాయితీలు, ప్రోత్సాహకాల విలువ రూ. 8,975 కోట్లకు (110 కోట్ల డాలర్లు) చేరుకోనుంది.  
 
→అస్సాం 2022 జనవరిలో విద్యుత్తు వాహన విధానాన్ని అమలుచేయడం. 
 
→ఆరంభించినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో 38,710 త్రిచక్ర విద్యుత్తు వాహనాలు, 1,903 ద్విచక్ర విద్యుత్తు వాహనాలు, 90 నాలుగు చక్రాల విద్యుత్తు వాహ నాలు అమ్ముడుపోయాయి. 
 
→రాయితీలు ఇవ్వడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలు, రహదారి పన్ను, పార్కింగ్ రుసుములను ఎత్తివేసిన అస్సాంలో మున్ముందు ఈ వాహనాల అమ్మకాలు మరింత ఊపందుకోనున్నాయి. 
 
→2021 నుంచి 2026-27 నాటికి అస్సాంలో లక్ష ద్విచక్ర విద్యుత్తు వాహనాలు, 75,000 త్రిచక్ర వాహనాలు, 25,000 నాలుగు చక్రాల వాహనాల అమ్మకాలను సాధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
→2030 కల్లా ప్రభుత్వ రవాణా బస్సులు, ఇతర ప్రభుత్వ వాహనాలన్నీ విద్యుత్తు చోదకమే కావాలని తీర్మా నించింది. 
 
→అప్పటికి అన్ని రవాణా, వాణిజ్య వాహనాలు శిలాజ ఇంధనాలను పూర్తిగా వదిలేసి, విద్యుత్తు వాహనాలుగా మారాల్సి ఉంటుంది.
 



National