image



త్రిపుర , మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికలు




→ఈశాన్యంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికల భేరీ మోగింది. 
 
→ఫిబ్రవరి 18న త్రిపుర, 27న మేఘాలయ, నాగాలాండ్ శాసనస భలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. 
 
→ఫిబ్రవరి 27నే ఐదు రాష్ట్రాల్లోని ఆరు శాసనసభ స్థానాలకు, లక్ష ద్వీప్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. మార్చి 2న వీటన్నింటి ఫలి తాలు వెలువరించనుంది. 
 
→కేంద్ర ప్రధాన ఎన్ని కల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తన సహచర కమిషనర్లు అనూస్చంద్ర పాండే, ఆరు ణ్ గోయల్ తో కలిసి   షెడ్యూల్ విడుదల చేశారు. 
 
→ఒక్కో రాష్ట్రంలో 00 చొప్పున మూడు ఈశాన్య రాష్ట్రాల్లో 180 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ఏడాది మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో తొలిదశ కింద వీటికి షెడ్యూల్ ఖరారు చేశారు. 
 
→వీటి శాసనసభల గడువు మార్చిలో ముగుస్తుంది. మూడు రాష్ట్రాల్లో కలిపి 63,06,429 నుంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా త్రిపురలో 28.29 లక్షల మంది ఉన్నారు. 
 
→మేఘాలయ (21 64 లక్షలు), నాగాలాండ్ (13,17 లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మూడు రాష్ట్రాల్లో కలిపి 1,17,850 మంది నవ ఓటర్లు తొలిసారి. 
 



National