image



హరిత ఇంధనం వచ్చేస్తోంది




→పెట్రోలు, డీజిల్, సహజ వాయువు (గ్యాస్) కు ప్రత్యా మ్నాయ ఇంధనం వచ్చేస్తోంది. పైగా కాలుష్యం వెదజల్లదు. కూడా. 
 
→వ్యక్తిగత, వాణిజ్య రవాణాకు, పారిశ్రామిక అవ సరాలకూ వినియోగించే అవకాశం ఉండటం దీని ప్రత్యే కత. 
 
→అదే గ్రీన్ హైడ్రోజన్, ఈ ఇందన ఉత్పత్తి త్వరలోనే పట్టాలెక్కేలా, కేంద్ర మంత్రివర్గం  'నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోద ముద్ర వేసింది. 
 
→2030 నాటికి 50 లక్షల టన్నుల వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలనేది లక్ష్యం. 
 
→ఇందుకోసం పరిశ్రమలు, పరిశోధనా సంస్థలను ప్రోత్సహించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించారు. ఫలి తంగా ఈ రంగంలోకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు లభిస్తాయని అంచనా. 
 
→దీంతోపాటు రూ.1 లక్ష కోట్ల విలు మైన కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశమూ ఉంది.
 
 
 
→ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి లభించిన విద్యుత్తును ఉపయోగించి, ఎలక్ట్రోలైజింగ్ ప్రక్రియ ద్వారా గ్రీన్ హైడ్రోజనన్ను ఉత్పత్తి చేస్తారు. 
 
→నీటిని విడదీసిన ఆక్సిజన్, హైడ్రోజన్ లభిస్తాయి. పెట్రోలు, డీజిల్ మండించినప్పుడు వెలువడే కర్బన ఉద్గారాలు.. హైడ్రోజన్ మండినప్పుడు ఉత్పత్తి కావు.
ప్రస్తుతం ఒక కిలో హైడ్రో జన్ ఉత్పత్తికి 2-3 డాలర్లు ఖర్చవుతోంది. 
 
→ఉత్పత్తి, సాంకే తిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ఈ ఖర్చు దిగివస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే దీన్ని భవిష్యత్తు ఇంద నంగా భావిస్తున్నారు.
 
 
 
→గ్రీన్ హైడ్రోజన్ ను నిల్వ రవాణా చేయడం కొంత సంక్లిష్ట వ్యవహారమే. దీన్ని వివిధ రంగాల్లో వినియోగిం చడానికి అనువైన ఉపకరణాలు, యంత్రాలు ఆవిష్కరిం చాల్సి ఉంది. 
 
→వీటిని త్వరగా ఆవిష్కరించగలిగితే. ప్రపంచ మార్కెట్కు అందించి లబ్ది పొందొచ్చు.
 
→పలు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ఈ విభాగంలో పెద్దఎత్తున అడుగుపెట్టేందుకు సన్నాహాలు  చేస్తున్నాయి.
 
→ఒక కిలో గ్రీన్ హైడ్రోజన్ ను 1 డాలర్ కంటే తక్కువ ధరలో ఉత్పత్తి చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యంగా పెట్టుకుంది. 
 
→భారీ స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం కోసం రూ.75,000 కోట్ల పెట్టు బడికి ఈ సంస్థ సిద్ధమవుతోంది.. 
 
→ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది. 
 
→యూఎస్ లోని బ్లూమ్ ఎనర్జీ సాంకేతికతను వినియోగిస్తోంది. 
 
→ఈ పైలెట్ ప్రాజెక్టును విశాఖపట్నంలోని ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్ ప్రాంగణంలో చేపట్టారు.
 
'కమిన్స్' హైడ్రోజన్ ఇంటర్నల్ కంబర్టన్ ఇంజిన్ :- 
 
→గ్రీన్ హైడ్రోజన్ ఇండ నంగా పనిచేసే ఇంజిన్లను ఆవిష్కరించడంలో కమిన్స్ ఇండియా తొలి అడుగు వేసింది. 
 
 
→మీడియం- టు- హెవీ డ్యూటీ ట్రక్కులకు అనువైన హైడ్రోజన్ ఇంట ర్నల్ కంబస్టన్ ఇంజిన్ను 'బి6, 7హెచ్ ఇంజిన్ పేరుతో రూపొందించింది. 
 
→దీనికి అనుబంధంగా 700 బార్ హైడ్రోజన్ ట్యాంక్ను కమిన్స్ ఇండియా తయారు చేసింది. దీనివల్ల ఇంధనాన్ని త్వరగా నింపడానికి వీలు వుతుంది. 
 
→ఈ ఇంజిన్ తో హెవీ డ్యూటీ ట్రక్కులు, బస్సులు సుదూర ప్రాంతాలకు వెళ్లగలుగుతాయి.
 
ఎంజీ హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ టెక్నాలజీ :- 
→ఎంజీ మోటార్ ఇండియా మూడో తరం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని మనదేశంలో ప్రవేశపెట్ట నుంది. 
 
→హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నడిచే కారును తాజాగా ఆవిష్కరించింది. అత్యధిక శక్తి, దీర్ఘకాల మన్నిక, భద్రత, నమ్మకమైన టెక్నాలజీ, పర్యావరణానికి అనుకూ లంగా ఉండటం దీని ప్రత్యేకత.
 
→ఆక్మే గ్రూపు 'సౌరశక్తి నుంచి గ్రీన్ హైడ్రోజన్, దాని నుంచి గ్రీన్ ఆమ్మోనియా ఉత్పత్తి చేసే ప్లాంటును రూ. 52,000 కోట్లతో కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. 
 
→2027కు పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వల్ల ఏటా 12 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్న ఉత్పత్తి చేయొచ్చు.
 
 
 



National