image



దిల్లీ వర్సిటీలోని మొగల్‌ గార్డెన్స్‌.. ఇక గౌతమ బుద్ధ సెంటినరీ




 
→దేశ రాజధానిలోని దిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్న మొగల్‌ గార్డెన్స్‌ పేరును గౌతమ బుద్ధ సెంటినరీగా మారుస్తున్నట్లు రిజిస్ట్రార్‌ వికాస్‌ గుప్తా వెల్లడించారు. 
 
→వర్సిటీలోని నార్త్‌ క్యాంపస్‌లో ఈ గార్డెన్‌ ఉంది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన గౌతమ బుద్ధ విగ్రహం గార్డెన్‌ మధ్యలో ఉంది. ఇది మొగల్‌ గార్డెన్స్‌ నమూనాలో లేదు. 
 
→మొగల్‌ నిర్మించిన గార్డెనూ కాదు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొగల్‌ గార్డెన్స్‌ పేరు మార్పునకు 15 రోజుల ముందే ఈ ప్రతిపాదన దస్త్రం ఉపకులపతి దగ్గరకు వెళ్లింది. 
 
→మార్చిలో జరిగే పూల ప్రదర్శన కార్యక్రమానికి ముందే పేరు మార్చాలని భావించామన్నారు. 
 
→రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొగల్‌ గార్డెన్స్‌ పేరును అమృత్‌ ఉద్యాన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
 
→అసలు మొగల్‌ గార్డెన్‌ అంటే ఏంటీ, ఎందుకు ఆ పేరుతో పిలుస్తుంటారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.
 
→ మొగల్‌ గార్డెన్‌ అనేది పర్షియన్‌ నిర్మాణంలో ఉంటుంది. కాలువలు, కొలనులతో పాటు జలపాతాలు ఉంటాయి. నీలి రంగు టైల్స్‌ ఈ గార్డెన్‌లో కనిపిస్తాయి. 
 
→ ఇరువైపులా కొండలు, వాటి మధ్యలో నీరు ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. ఈ గార్డెన్‌లో పూలు, పండ్ల చెట్లు ఉంటాయి. తాజ్‌మహల్‌లో ఇలాంటి నమూనా గార్డెన్‌ ఉందని ఆయన వివరించారు.
 



National