image



దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా దిల్లీ




→  జాతీయ రాజధాని దిల్లీ దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. 
 
→ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) 2022 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
→ ఇక్కడి గాలిలో సూక్ష్మధూళి కణ కాలుష్యం 2.5 పీఎం స్థాయులు సురక్షిత పరిమితి కంటే రెట్టింపు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. 
 
→ అయితే, గత నాలుగేళ్లలో దిల్లీ కాలుష్యం ఏడు శాతం మేర తగ్గటం గమనార్హం. 2019లో ఇది క్యూబిక్ మీటరుకు 108 మైక్రోగ్రాములు ఉండగా, 2022 నాటికి 99.71 మైక్రోగ్రాములకు తగ్గింది. 
 
→ ఈ కాలుష్యాన్ని 2024 నాటికి 20 నుంచి 30 శాతానికి తగ్గించాలని ఎన్సీఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. 
 
→ దిల్లీ తర్వాత క్యూబిక్ మీటరుకు 95.64 మైక్రోగ్రాములతో హరియాణాలోని ఫరీదాబాద్ కాలుష్య నగరాల్లో ద్వితీయస్థానంలో ఉంది. 
 
→ ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ 91.25 మైక్రోగ్రాములతో తృతీయ స్థానంలో నిలిచింది. 
 
→ దేశవ్యాప్తంగా నగరాల్లో గాలి కాలుష్య స్థాయులు విశ్లేషిస్తే 2022 నాటికి గాలి నాణ్యతలో కొంత మెరుగుదల ఉన్నట్లు వాతావరణ విభాగ డైరెక్టర్ ఆర్తీ భోస్లా తెలిపారు.
 
 
→దేశంలోని 102 నగరాల్లో గాలిలో కాలుష్యం తగ్గిం చడానికిగాను కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో 2019 జనవరి 10న ఎన్సీఏపీ ఏర్పాటు చేసింది. 
 
→ఈ జాబి తాను తర్వాత సవరించి, కొన్ని నగరాల పేర్లు తొల గించి.. మరికొన్ని పేర్లను చేర్చారు. 
 
→ప్రస్తుతం ఈ జాబి తాలో ఉన్న 131 నగరాలను లక్ష్యానికి దూరంగా ఉన్న నగరాలుగా పేర్కొం టున్నారు. 
 
→జాతీయ గాలి నాణ్యత ప్రమా ణాలను ఈ నగరాలు సాధించాల్సి ఉంది. 
 
→గతేడాది సెప్టెంబరులో కాలుష్య నియంత్రణ లక్ష్యాన్ని 40 శాతంగా సవరించిన ప్రభుత్వం 2026 నాటికి దీన్ని సాధించాలని గడువు విధించింది.
 



National