→కశ్మీర్ లోయలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గణతంత్ర దిన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.
→పొరుగు దేశం పిలుపుతో జమ్మూకశ్మీర్‌లో చిందిన ప్రతి రక్తపుబొట్టుకు, కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకుంటామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన ప్రసంగంలో అన్నారు.
→కశ్మీరీ పండిట్ ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
→శ్రీనగర్ లాల్‌చౌక్‌లోని క్లాక్‌టవర్‌పై గత 30 ఏళ్లలో రెండోసారి జాతీయ పతాకం ఎగిరింది.
→గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం విశిష్ట సేవలు అందించిన 32 మందిని ప్రభుత్వ అవార్డులకు ఎంపిక చేసింది.
→ ఉత్తర గోవాలోని సత్తారీ తాలూకాలో గల చరిత్రాత్మక నానుస్ కోటలో తొలిసారిగా గణతంత్ర వేడుకల గౌరవ వందన సమర్పణ జరిగింది.
→1852లో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ చెలరేగిన భారీ తిరుగుబాటును ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.
National