image



జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు




→పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్‌ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.
 
→ గత ఏడాది జులైలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపదీ ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. 
 
→ 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ ఇదే కానుంది. 
 
→ తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. 14 నుంచి మార్చి 12 వరకు సెలవులు ఉంటాయి. 
 
→ రెండో విడత బడ్జెట్‌ భేటీలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్‌ 6 వరకు సాగుతాయి. అన్ని స్థాయీసంఘాలు బడ్జెట్‌ పద్దులపై నివేదికలు సమర్పించిన వాటిపై ఈ సమయంలో చర్చించి, ఆమోదించడం జరుగుతుంది. మొత్తం 66 రోజుల వ్యవధిలో ఉభయసభలు 27 రోజులు భేటీ అవుతాయి.
 



National