భారత్‌కు చెందిన ఓ జలాంతర్గామి తొలిసారి ఇండోనేసియాలోని రేవులో లంగరేసింది.
దాదాపు 3,000 టన్నుల బరువైన ‘ఐఎన్‌ఎస్ సింధుకేసరి’ సుందా జలసంధి మీదుగా జకార్త చేరుకుంది.
భారత యుద్ధ నౌకలు, ఇండోనేసియా, ఇతర ఆసియా దేశాలను తరచూ సందర్శిస్తుంటాయి.
కానీ, ఒక సబ్‌మెరైన్‌ను భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే మొదటిసారని నౌకాదళ సీనియర్ అధికారులు వెల్లడించారు.
భారత్ - ఇండోనేసియా ఏటా రెండుసార్లు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తాయి. 2018లో రక్షణ సహకార ఒప్పందంపైనా సంతకాలు చేశాయి.
అదే ఏడాది ఐఎన్‌ఎస్ సింధు కేసరికి రూ.1,197 కోట్లు వెచ్చించి రష్యాలో పలు అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు.
దీంతో పాటు మరో నాలుగు సింధుఘోష్ శ్రేణి, హెచ్‌డీడబ్ల్యూ శ్రేణి జలాంతర్గాముల్లో కూడా ఇటువంటి చర్యలు చేపట్టారు.
National