image



విశాఖలో నౌకాదళ బార్జి జలప్రవేశం




→నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన ఎంసీఏ (మిసైల్‌ - అమ్యూనిటైజేషన్‌) బార్జి (భారీ నౌకలను ఒడ్డుకు తీసుకొచ్చి, మళ్లీ సముద్ర జలాల్లోకి పంపేది) విశాఖపట్నం నుంచి జలప్రవేశం చేసింది. 
 
→‘భారత్‌లో తయారీ’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా మెజర్స్‌ సెకాన్‌ సంస్థ బార్జి నిర్మాణం చేపట్టిందని నేవీ వర్గాలు తెలిపాయి. 
 
→నౌకాదళ అవసరాల నిమిత్తం జెట్టీ, ఔటర్‌ హార్బర్‌ మధ్య సుమారు 30 ఏళ్ల పాటు నూతన బార్జి సేవలు అందించబోతున్నట్లు రియర్‌ అడ్మిరల్‌ సందీప్‌ మెహతా తెలిపారు. 
 
→భారత నౌకాదళంలోనే తొలిసారిగా క్షిపణులు, మందుగుండు, ఆయుధ సామగ్రి కలిగిన బార్జిగా దీన్ని సిద్ధం చేశామన్నారు.
 



National