image



సుఖోయ్ యుద్ధవిమానాల సత్తా పెంపు




→  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన బ్రహ్మోస్, అస్త్ర వంటి క్షిపణులను జోడించడం వల్ల భారత్ వద్ద ఉన్న సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమా నాలు శక్తిమంతమయ్యాయి. 
 
→  సరిహద్దుల్లో చైనా, పాకి స్థాన్ కవ్వింపుల నేపథ్యంలో ఇవి మన వైమానిక దళా నికి వ్యూహాత్మక పై చేయిని అందిస్తున్నాయి. 
 
→  ఈ రకం యుద్ధవిమానాలు డ్రాగన్ దేశం వద్ద కూడా ఉన్నప్ప టికీ.. వాటికన్నా మన జెట్లు అత్యుత్తమమైనవని భారత వాయుసేన ఉన్నతాధికారి గ్రూప్ కెప్టెన్ అర్చిత్ కాలా పేర్కొన్నారు.
 
→చైనా, రష్యా, అర్మేనియా, ఇండోనేసియా, అల్జీరియా సహా.. దాదాపు 15 దేశాల వద్ద సుఖోయ్-30 యుద్ధవి మానాలు ఉన్నాయి. 
 
→భారత్ మాత్రమే ఈ లోహవిహం గాలకు దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యాన్ని కల్పించింది. ఎప్పటి కప్పుడు ఆధునిక ఆయుధాలను జోడించింది. 
 
→భారత వైమానిక దళం వద్ద ఇలాంటివి 272 యుద్ధవిమానాలు ఉన్నాయి. 
 
→"మన సువోయ్ లో ప్రపంచవ్యాప్తంగా, స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆధునిక టెక్నాలజీలు, ఆయుధాలను అమర్చాం, గాల్లో నుంచి గాల్లోకి, నేలపైకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణుల వల్ల ఈ జెట్ మరింత శక్తిమంతంగా మారింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధవిమానాల్లో ఒకటి" అని అర్చిత్ పేర్కొన్నారు.
 
→భారతీయ సుబోయ్ లు 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలవు. 
 
→దాన్ని 700 కిలోమీ టర్లకు పెంచనున్నారు. దీనివల్ల శత్రుదేశాల గగన తల రక్షణ వ్యవస్థలను సునాయాసంగా ధ్వంసం చేయవచ్చు.
 
→అగ్ర మార్క్-1 క్షిపణి.. 100 కిలోమీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలను నేలకూల్చగలదు. 300 కిలోమీ టర్ల దూరంలోని శత్రు యుద్ధవిమానాలను ధ్వంసం చేసేలా ఈ క్షిపణిని మెరుగుపరుస్తున్నారు.
 
→కొత్తతరం యాంటీ రేడియేషన్ ఆస్ట్రాలనూ సులో య్ అమర్చనున్నారు. దీనివల్ల 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు రాడార్లను నేలమట్టం చేయవచ్చు.
 
→లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల స్పైస్-2000 బాంబులనూ భారత సుఖోయ్ లో అమర్చారు.
 
→ఈ అస్త్రాలకు తోడు భారతీయ పైలట్ల నైపుణ్యం కూడా అదనపు హంగుగా నిలిచింది.
 
→ఈ యుద్ధ విమానం అద్భుతమైన విన్యాసాలను చేయ గలదు. గగనతలంలో పలుమార్లు ఇంధనాన్ని నింపు కోవడం ద్వారా సుదీర్ఘ ప్రయాణం చేయగలదు.
 



Science