image



భారత్ నుంచి 75 దేశాలకు ఆయుధాల ఎగుమతులు




→  భారత రక్షణ ఎగుమతులు గడిచిన ఐదేళ్లలో ఎనిమిది రెట్లు పెరిగాయని, ప్రస్తుతం భారత్ 75 దేశా లకు రక్షణకు సంబంధించిన ఎగుమతులు చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. 
 
→  'సమష్టి కృషి, భాగస్వామ్యం' అన్న సహకార భావనే భారతన్ను.. రక్షణ రంగంలో ఇతర దేశాలతో పోల్చితే ప్రత్యేక స్థానంలో నిలుపుతోందని ఆయన వివరించారు. 
 
→  'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా చేసే ప్రయత్నాలు కేవలం భారత్ కు మాత్రమే ప్రయోజనం చేకూర్చాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. 
 
→బెంగళూరులో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు నిర్వహించనున్న 'ఏరో ఇండియా' 14వ ఎడిషన్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్కు సంబంధించిన ప్రతి నిధుల రౌండ్ టేబుల్ సమావేశం     జరిగింది. 
 
→ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. భారత్లోని మానవ వనరులు, నైపుణ్య శక్తి, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక రంగంలో విస్తృత నవీన ఆవిష్కరణలకు దోహదం చేస్తున్నాయన్నారు.
 
→ 20 మూడు అభివృద్ధి (డెవలప్మెంట్), ప్రజా స్వామ్యం(డెమోక్రసీ), వైవిధ్యం (డైవర్సిటీ) అనే మూడు 'డీ'లు ప్రపంచానికి భారత్ తెలియజేస్తుంది.
 



Science