image



మురుగు నీటి నుంచి కొత్త వేరియంట్ల గుర్తింపు




→మురుగు నీటిలో ఉండే కొవిడ్‌ వైరస్‌ అవశేషాలతో కొత్త వైరస్‌ వేరియంట్ల వ్యాప్తిని మరింత పక్కాగా గుర్తించవచ్చని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ జెనెటిక్స్‌ అండ్‌ సొసైటీ (టీఐజీఎస్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ (ఎన్‌సీబీఎస్‌), బయోమ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ట్రస్ట్‌ (బీఈటీ) సంయుక్త అధ్యయనం చేసి వెల్లడించాయి. 
 
→2022 జనవరి నుంచి జూన్‌ వరకు బెంగళూరులో 1.1 కోట్ల మంది నివసించే 28 ప్రదేశాల్లో మురుగు నీటిని సేకరించి పరిశీలించగా జినోమ్‌ సీక్వెన్సింగ్‌లో వైరస్‌ వేరియంట్ల పెరుగుదల, వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
→ఈ పద్ధతిలో కరోనా ప్రభావిత హాట్‌స్పాట్‌ ప్రదేశాలను గుర్తించవచ్చని ఎన్‌సీబీఎస్‌ ప్రొఫెసర్‌ డా.ఉమా రాధాకృష్ణన్‌ తెలిపారు. క్లినికల్‌ నమూనాలతో పోల్చితే మురుగు నీటిలో వైరస్‌ అవశేషాలు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయని, కొత్త వేరియంట్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ద్వారా గుర్తించే వీలుందన్నారు. ఈ అధ్యయనంలోని ఫలితాలను తీసుకున్న బెంగళూరు మహానగర పాలిక అధికారులు కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారని, హాట్‌స్పాట్‌ ప్రదేశాల్లో క్లినికల్‌ పరీక్షలను మరింతగా పెంచారని వివరించారు.
 



Science