image



ప్రాణాంతక రక్త క్యాన్సర్ కు సమర్థ చికిత్స




→ దీర్ఘకాలం స్థిరంగా ఉండే వ్యాధి దశ నుంచి ప్రాణాంతక వ్యాధిగా రక్త క్యాన్సర్ మారడానికి కారణమవుతున్న డి. యు.ఎస్.పి6 రేణువును అడ్డుకుంటే వ్యాధి విజృంభణను నివారించ వచ్చని వాషింగ్టన్ విశ్వవిద్యా లయ వైద్య కళాశాల పరిశోధ కులు నిర్ధారించారు. ఎలుకల పైన, మానవుల నుంచి తీసిన క్యాన్సర్ కణితులపైన జరిపిన ప్రయోగాలు ఈ
 
→నిర్ధారణకు దారితీశాయని విఖ్యాత నేచర్ - క్యాన్సర్ పత్రికలో ప్రచురితమైన అధ్య యనం తెలిపింది. శరీరంలో రక్తాన్ని జనిం పజేసే కణజాలానికి వచ్చే క్యాన్సర్ను క్రానిక్ లుకేమియా అంటారు. ఇది ఒక్కసా రిగా రోగిని కబళించకుండా చాలాకాలం కొనసాగుతుంది. కొందరిలో చికిత్స అవసర మైతే, చాలామందిలో లుకేమియా పురోగ తిపై నిఘా ఉంచితే సరిపోతుంది. నెమ్మ దిగా పురోగమించే లుకేమియా కొద్దిమం దిలో ఉన్నట్టుండి విజృంభిస్తుంది. 
 
→దీన్ని నిరో ధించడానికి సమర్థ చికిత్సా విధానాలేవీ అందుబాటులో లేవు. ఈ దశకు చేరిన ప్రతి రోగి మరణించడం దాదాపు ఖాయం. క్రానిక్ లుకేమియా రోగుల చికిత్సకు జేఏకె 2 నిరో ధకాలను ఇస్తారు. ఆ మందులకూ లుకే మియా లొంగకపోతే ప్రాణాంతకంగా మారు తుంది. జేఎకె 2 ను డి. యు.ఎస్.పి6 రేణువు అడ్డుకొంటోందని పరిశోధనలో తేలింది. జన్యు చికిత్సతో దీనిని తొలగిస్తే ఎలుకల్లో క్రానిక్ లుకేమియా ప్రాణాంతకంగా మారడం. లేదని పరిశోధకులు గుర్తించారు.
 



Science