image



చంద్రుడి అవతలి వైపు చీకటా?




→చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు. ఆ  చల్లటి వెన్నెల పరవశంలో ఎన్ని కథలు, కవితలు పుట్టుకొచ్చాయో! అయితే మనకు ఎప్పుడూ చంద్రుడి ఒక వైపే కనిపిస్తుంది. 
 
→అవతలి వైపు కనిపించదు. అందుకే దాన్ని చీకటి భాగమనీ అభివర్ణిస్తుంటారు. నిజానికి అక్కడేమీ చీకటిగా ఉండదు. 
 
→ఇవతలి వైపున పడినట్టుగానే అక్కడా ఎండ పడుతుంది. మరెందుకు కనిపించదు? దీనికి కారణం- చంద్రుడు తన కక్ష్య మీద ఒకసారి పూర్తిగా భ్రమించటానికి పట్టే సమయం. 
 
→భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం సమానంగా ఉండటమే. దీన్నే టైడల్ లాకింగ్ అంటారు. 
 
→గ్రావిటేషనల్ లాకింగ్, క్యాప్చర్డ్ రొటేషన్, స్పిన్-ఆర్బిట్ లాకింగ్ అనీ పిలుస్తారు. దీని మూలంగానే చంద్రుడి ఒక వైపే మనకు కనిపిస్తుంది. 
 
→చంద్రుడి భ్రమణం భూమి గురుత్వాకర్షణ మీద ఆధారపడి ఉంటుంది.
 
→మన సౌర వ్యవస్థలో గ్రహాల చుట్టూ భ్రమించే చంద్రుళ్లన్నీ ఇలాగే తిరుగుతూ ఉంటాయి. 
 
→నిజానికి కోట్లాది సంవత్సరాల క్రితం చంద్రుడి అవతలి భాగాలూ భూమి నుంచి కనిపించాయి. 
 
→ఎందుకంటే అప్పుడు చంద్రుడి భ్రమణం ఇప్పటికన్నా భిన్నంగా ఉండేది. క్రమంగా భూమి, చంద్రుడి శ్రీ మధ్య గురుత్వాకర్షణ బలాలు స్వల్పంగా మారిపోయాయి. 
 
→'ఫలితంగా కక్ష్యలు, భ్రమణ వేగాలూ తారుమారయ్యాయి. చంద్రుడి కన్నా భూమి పరిమాణం చాలా ఎక్కువ. కాబట్టి " సమతుల స్థితికి చేరుకునేంతవరకు చంద్రుడి భ్రమణ వేగం నెమ్మదించింది. 
 
→ఇదే టైడల్ లాకింగ్కు కారణమైంది. చంద్రుడి టైడల్ బలాలు భూమి భ్రమణ వేగాన్నీ నెమ్మదింపజేస్తున్నాయి. 
 
→దీని మూలంగానే భూమి రోజు వ్యవధి పెరిగింది. ఇప్పటికీ చంద్రుడు ఏడాదికి 15 మైక్రో సెకండ్ల మేరకు భూమి భ్రమణ వేగాన్ని నెమ్మదింపజేస్తున్నాడు   
 



Science