image



మొండి వైరస్ ల గుట్టు.. ఇలా రట్టు




→ నాసికా స్రావాలలో ఉన్న రోగనిరోధక వ్యవస్థను జన్యుక్రమ విశ్లేషణతో పరిశీలిస్తే.. సాధారణ పరీక్షలలో బయటప డని వైరస్ల గుట్టు కూడా బహిర్గతమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
→ ఈ విషయాన్ని ద లాన్సెట్ మైక్రోబ్ జర్నల్లో తాజాగా ప్రచురితమైన పరిశోధన పత్రం వివరించింది. ప్రజారోగ్య వ్యవస్థలు గుర్తించేలోపే ప్రమాదకరమైన కొత్త వైరస్లు వ్యాపిస్తా యన్న విషయం కొవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో తెలిసింది. 
 
→ ప్రమాదకరమైన కొత్త వైరస్ ను గుర్తించడమంటే.. పెద్ద గడ్డిమేటులో సూదిని వెతకడం లాంటిదని అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఎలెన్ ఫాక్స్ మన్ అన్నారు. 
 
→ ఇప్పుడు గడ్డిమేటు పరిమాణాన్ని తగ్గించే మార్గాన్ని కనుగొన్నామని తెలిపారు. 10-15 రకాల వైరస్లలను గుర్తించేందుకు నాసికా స్రావాలను పరిశీలిస్తారు. 
 
→ వీటిలో చాలా పరీక్షలకు నెగెటివ్ ఫలితాలే వస్తాయి. కానీ, నెగెటివ్ వచ్చిన కొంతమందిలో యాంటీ వైరల్ రక్షణ వ్యవస్థ క్రియాశీలకం అయినట్లు ఫాక్స్మన్ బృందం గుర్తించింది. 
 
→ అంటే, ఏదో వైరస్ ఉందన్నమాట. ఒకే యాంటీవై రల్ ప్రొటీన్ ఉన్న నమూనాలను సమగ్రంగా జన్యుక్రమ విశ్లేషణకు పంపగా అందులో ఇన్ఫ్లుయెంజా సి అనే వైరస్ ఉన్నట్లు గుర్తిం చారు. 
 
→ దాంతో న్యూయార్క్ పరిసరాల్లో 2020 మార్చి మొదటి రెండు వారాల్లో కొవిడ్ నెగెటివ్ వచ్చిన నమూనాలనూ ఇదే తర హాలో విశ్లేషించారు. ఇలా వందల నమూనాలను పరిశీలించారు. 
 
→ కొన్నింటిలో మాత్రం యాంటీవైరల్ రక్షణ వ్యవస్థ కనిపించింది. వాటిలో నాలుగు కేసుల్లో కొవిడ్-19 ఉందని, దాన్ని అప్పట్లో గుర్తిం చలేదని గమనించారు. 
 
→ దాంతో.. మన శరీరం తయారుచేసే యాంటీవైరల్ ప్రొటీన్ ను పరీక్షిస్తే ఇప్పటివరకు తెలియని వైర స్లూ తెలుస్తాయని సూత్రీకరించారు.
 



Science