image



మూడున్నరేళ్ల ముందే అల్జీమర్స్‌ను గుర్తించొచ్చు




→సాధారణ వైద్య పరీక్షలతో పోలిస్తే మూడున్నరేళ్ల ముందే అల్జీమర్స్‌ వ్యాధిని గుర్తించే ఒక రక్తపరీక్షను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 
 
→మెదడు కణాల పుట్టుక ప్రక్రియ (న్యూరోజెనిసిస్‌)ను రక్తంలోని పదార్థాలు నియంత్రిస్తాయన్న సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది. 
 
→ మెదడులోని హిప్పోక్యాంపస్‌ అనే ముఖ్య భాగంలో న్యూరోజెనిసిస్‌ ప్రక్రియ జరుగుతుంది. అభ్యాసం, జ్ఞాపకశక్తికి ఈ భాగానికి ప్రమేయం ఉంది.
 
→ అల్జీమర్స్‌ ఆరంభ దశలో ఉన్నప్పుడు హిప్పోక్యాంపస్‌లో నాడీ కణాల పుట్టుక ప్రక్రియ దెబ్బతింటుంది. 
 
→ అయితే వ్యాధి తీవ్రమైన దశల్లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రక్రియ ఉంటుందన్న మునుపటి వాదన తప్పని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
→ విషయ గ్రహణ సామర్థ్యం ఒక మోస్తరు స్థాయిలో దెబ్బతిన్న (ఎంసీఐ) బాధితులు 56 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి, పరిశీలన జరిపారు. 
 
→ ఈ రుగ్మత ఉన్నవారు భవిష్యత్‌లో అల్జీమర్స్‌ బారినపడే అవకాశం ఎక్కువ.
 
→ శాస్త్రవేత్తలు పరిశీలించిన 56 మందిలో 36 మందికి ఆ తర్వాత వ్యాధి ఉత్పన్నమైంది. 
 
→ ఈ నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు మూడున్నరేళ్ల ముందే న్యూరోజెనిసిస్‌ సంబంధ మార్పుల ఆనవాళ్లను రక్తంలో గుర్తించగలిగారు. 
 



Science