image



మరణం ముప్పును తగ్గించే మూడో డోసు




→బహుళ ఆరోగ్య సమస్యలున్న వారు కొవిడ్‌-19 టీకా మూడో డోసు తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని హాంకాంగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. 
 
→రెండో డోసు పొందిన వారితో పోలిస్తే వీరికి అకాల మరణం ముప్పు 90 శాతం తగ్గుతుందని వెల్లడైంది. 
 
→2021 నవంబరు నుంచి 2022 మార్చి మధ్య కొవిడ్‌ టీకా మూడో డోసు పొందిన పలువురిని పరిశోధకులు పరిశీలించారు. 
 
→వారికి అధిక రక్తపోటు, మధుమేహం, దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి వంటి రుగ్మతలు ఉన్నాయి. 
 
→రెండు డోసులు మాత్రమే పొందిన వారితో వీరిని పోల్చి చూశారు. ప్రాణాలు కాపాడటంలో మూడో డోసు సమర్థత ఇందులో వెల్లడైంది.
 



Science