image



సముద్రమట్టాల పెరుగుదలతో ముప్పు ఎక్కువే!




→సముద్రమట్టాల పెరుగుదల వల్ల మానవాళికి కలిగే ముప్పు మునుపటి అంచనాల కంటే ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. 
 
→గతంలో ఊహించిన దానితో పోలిస్తే రెండు రెట్లకుపైగా భూభాగంలో జల విలయం కనిపించే అవకాశాలున్నాయని పేర్కొంది. 
 
→అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2018లో ప్రయోగించిన ఐసీఈశాట్‌-2 లిడార్‌ ఉపగ్రహం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 
 
→సముద్రమట్టాల్లో అనేక మీటర్ల మేర పెరుగుదల నమోదైనప్పుడు చాలా వరకు తీర ప్రాంతాలు నీట మునుగుతాయని ఇప్పటి వరకు అత్యధిక మంది పరిశోధకులు అంచనా వేశారు. 
 
→అయితే ఈ పెరుగుదల కేవలం 2 మీటర్లకు చేరుకున్నా గతంలో ఊహించిన దాని కంటే 2.4 రెట్ల భూభాగాన్ని నీరు పూర్తిగా కప్పేస్తుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. 
 
→ఈ అధ్యయనం ‘ఎర్త్‌ ఫ్యూచర్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.
 



Science