image



కౌమార చింపాంజీల్లో రిస్కు సామర్థ్యం ఎక్కువే




 
→రిస్కు తీసుకునే సామర్థ్యం విషయంలో మానవ టీనేజర్లు, కౌమారప్రాయ చింపాంజీల మధ్య సారూప్యతలు ఉన్నాయని తాజా పరిశోధన తేల్చింది. 
 
→అయితే పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే వ్యవహారశైలి విషయంలో అవి మానవులతో పోలిస్తే వెనకబడ్డాయని వెల్లడైంది. 
 
→చింపాంజీలు 50 ఏళ్ల వరకూ జీవించగలవు. 8 నుంచి 15 ఏళ్ల మధ్య అవి కౌమార ప్రాయంలో ఉంటాయి. 
 
→ఆ సమయంలో వాటిలో హార్మోన్ల స్థాయి వేగంగా మారుతుంది. కొత్త బంధాలను ఏర్పర్చుకుంటాయి. దురుసు స్వభావం పెరుగుతుంది. 
 
→గుర్తింపు కోసం పోటీ పడతాయి. రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో 40 చింపాంజీలపై పరిశోధన చేసిన అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. 
 
→పరిశోధనలో భాగంగా వీటికి రెండు రకాల డబ్బాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని నిర్దేశించారు. 
 
→ఒక డబ్బాలో చింపాంజీలు ఒకింత ఇష్టపడే వేరుశనగ ఉన్నాయి. 
 
→రెండో డబ్బాలో ఆ జీవులకు బాగా ఇష్టమైన అరటిపండు కానీ అవి విముఖత ప్రదర్శించే దోసకాయ ముక్కను కానీ పెట్టారు. 
 
→రిస్కు వద్దనుకుంటే వేరుశనగలు ఉన్న డబ్బాను తీసుకునే అవకాశం వాటికి కల్పించారు. 
 
→రిస్కు తీసుకుంటే అత్యంత ప్రీతిపాత్రమైన అరటి పండును పొందొచ్చు. అదృష్టం కలిసిరాకుంటే ఇష్టంలేని దోసకాయ తారసపడొచ్చు. 
 
→డబ్బా తెరిచాక చింపాంజీల భావోద్వేగ స్పందనలను, అరుపులను శాస్త్రవేత్తలు నమోదు చేశారు. 
 
→వాటి లాలాజలాన్ని సేకరించి, హార్మోన్ల స్థాయినీ పరిశీలించారు. కౌమార ప్రాయంలో ఉన్న చింపాంజీలు ఎక్కువగా రిస్కు తీసుకున్నాయని తేల్చారు.  
 



Science