image



యూవీ నెయిల్‌ పాలిష్‌ డ్రయర్లతో క్యాన్సర్‌ ముప్పు




→సెలూన్లలో వాడే అతినీల లోహిత (యూవీ) నెయిల్‌ పాలిష్‌ డ్రయింగ్‌ సాధనాలతో మానవ కణాల్లో క్యాన్సర్‌ కారక ఉత్పరివర్తనలు తలెత్తవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. 
 
→అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 
 
→యూవీ కాంతిని వెదజల్లే సాధనాలను 20 నిమిషాలపాటు ప్రయోగిస్తే వాటి తాకిడికి గురైన కణాల్లో 20-30 శాతం చనిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. 
 
→60 నిమిషాలకు 65 నుంచి 70 శాతం కణాలు మృత్యువాత పడుతున్నాయని వివరించారు. మిగిలిన కణాల్లో డీఎన్‌ఏ దెబ్బతింటున్నట్లు పేర్కొన్నారు. 
 
→ఫలితంగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయని, చర్మ క్యాన్సర్‌లో కనిపించే పోకడలను వాటిలో గుర్తించినట్లు వివరించారు. 
 
→కొంతకాలం తర్వాత కూడా ఆ మార్పులు సమసిపోవడంలేదని తెలిపారు.
 



Science