image



కౌమారంలో నిద్ర తగ్గితే పెద్దయ్యాక మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌




→కౌమార ప్రాయంలో, అంటే 15-19 ఏళ్ల మధ్య వయసులో రోజుకు కనీసం ఏడు గంటలసేపు చక్కగా నిద్రపోని వారు పెరిగి పెద్దయ్యాక మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ (ఎంఎస్‌) వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని స్వీడన్‌లో జరిగిన పరిశోధనలు తెలిపాయి. 
 
→ఏడు గంటల లోపు నిద్రను స్వల్ప నిద్రగా వర్గీకరించారు. 7-9 గంటల నిద్రను మంచి నిద్రగా, 10 గంటలు, అంతకుమించిన నిద్రను సుదీర్ఘమైనదిగా నిర్వచించారు.
 
→ సెలవు దినాల్లో, వారాంతంలో సుదీర్ఘ నిద్ర ఎంఎస్‌కు దారితీయదు. 
 
→ కనీసం ఏడు గంటలసేపైనా నిదురించకపోతే మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వ్యాధికి దారి తీయవచ్చునని తేల్చారు. 
 
→ సరిగ్గా నిద్రపట్టకపోయినా సమస్యే. రక్తనాళాలు గట్టిపడే ఈ వ్యాధి మెదడు, వెన్నెముక, కళ్ల నరాలను దెబ్బతీస్తుంది. 
 
→ చిన్న వయసులో షిఫ్టులవారీగా పనిచేయడమూ ఎంఎస్‌కు దారి తీయవచ్చు. 
 



Science