image



మానసిక ఒత్తిడికి హైపోథాలమస్సే మూలం




→నిరంతరం మానసిక ఒత్తిడికి గురైతే మానసిక కుంగుబాటు, గతంలో ఆనందమిచ్చిన అంశాలపై ఆసక్తి తగ్గిపోవడం, మనో విఘాతం తరవాత దీర్ఘకాలం పీడించే మానసిక రుగ్మత (పీటీఎస్డ్డీ) తలెత్తవచ్చు.  
 
→మానసిక ఒత్తిడి వ్యక్తి ప్రవర్తనలో విపరీత మార్పులు తెస్తుందని అమెరికాలోని అగస్టా విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. 
 
→మెదడులో హైపోథాలమస్‌ అనే భాగం భావోద్వేగాలను కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. 
 
→నిద్ర, ఆహార, భయం వంటి భావనలతో పాటు శృంగార కాంక్షలకు కేంద్రమిదే. 
 
→ఈ భాగంలోని పీఓఎంసీ న్యూరాన్ల సమూహాన్ని 10 రోజుల పాటు నిరంతరం, అనూహ్య ఒత్తిడికి గురిచేయగా నిరాశా నిస్పృహలు తలెత్తడంతోపాటు శృంగార కాంక్ష తగ్గడం, ఆనందదాయక క్షణాలను ఆస్వాదించలేకపోవడం వంటివి సంభవిస్తున్నట్లు ఆడ, మగ ఎలుకలపై పరిశోధనలు తేల్చాయి. 
 
→హైపోథాలమస్‌లోనే ఉన్న ఏజీఆర్పీ న్యూరాన్లు నిరంతర ఒత్తిడి నుంచి, మానసిక కుంగుబాటు నుంచి కోలుకోవడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
 



Science