image



ఆరేళ్ల ముందే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను పసిగట్టే ఏఐ




→నానాటికీ పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ మేధ (ఏఐ) సాధనాన్ని అభివృద్ధి చేశారు. 
 
→దీని సాయంతో ఈ వ్యాధి ముప్పును ఆరేళ్ల ముందే పసిగట్టవచ్చని తేల్చారు. క్యాన్సర్‌ మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వాటా చాలా ఎక్కువ. 
 
→ఈ నేపథ్యంలో ధూమపానం అలవాటున్న 50-80 ఏళ్ల మధ్య వయసున్న వారిని స్క్రీన్‌ చేయడానికి ‘లో డోస్‌ చెస్ట్‌ కంప్యూటెడ్‌ టొమోగ్రఫీ’ (ఎల్‌డీసీటీ)ని సిఫార్సు చేస్తుంటారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణాలను 24 శాతం మేర తగ్గిస్తున్నట్లు వెల్లడైంది.
 
→మరోవైపు అన్ని వర్గాల వారికీ స్క్రీనింగ్‌ నిర్వహించి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పును అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసే సాధనాలు అవసరమయ్యాయి.
 
→ఈ దిశగా మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ‘సిబిల్‌’ అనే కృత్రిమ మేధ సాధనాన్ని అభివృద్ధి చేశారు.
 
→ఎన్నడూ పొగతాగని వారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు పెరగడాన్ని బట్టి ఈ వ్యాధికి అనేక అంశాలు దోహదపడుతున్నట్లు స్పష్టమవుతోంది. వాటి గురించి ప్రస్తుతం తెలియదు.
 
→పర్యావరణ, జన్యుముప్పు అంశాలను విశ్లేషించడానికి బదులు ఒక వ్యక్తిలో జీవశాస్త్ర అంశాలను తాజా ఏఐ సాధనం పరిశీలిస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న లీసియా సీక్విస్ట్‌ పేర్కొన్నారు.
 
→నేషనల్‌ లంగ్‌ స్క్రీనింగ్‌ ట్రయల్‌ (ఎన్‌ఎల్‌ఎస్‌టీ) డేటాను ఉపయోగించి, ఈ బృందం సిబిల్‌ను అభివృద్ధి చేసింది.
 



Science